సినిమా టికెట్ల రేట్లు పెంచమని అదనపు షోలను అనుమతించబోమని అసెంబ్లీలో అర్భాటపు మాటలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతించాడంటూ బీఆర్ఎస్ మా జీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. తాజాగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
నిర్మాత దిల్ రాజు దిల్ కు ఎంతకు అమ్ముడు పోయాడవని రేవంత్ రెడ్డిపై రసమయి మండిపడ్డారు. సినిమాలకు అదనపు ప్రదర్శనకు ఎందుకు? టికెట్లు రేట్లు ఎందుకు పెంచాలి.. నిజాయితీగా నిలబడతా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారని నిలదీశారు. దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపునకు, అదనపు షోలకు అనుమతి వెనుక జరిగిన గేమ్ ఛేంజ్ ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు. దిల్ రాజు లో దిల్ ఆంధ్రా వైపు.. రాజు మాత్రమే తెలంగాణ వైపు ఉంటాడని మేము తెలంగాణ ఉద్యమం నుంచి చెబుతూ వస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు పనేమి లేదన్నట్టుగా ఉదయం 4 గంటలకు నిద్రలేచి సినిమా చూడాల్సిన అవసరమేమి లేదన్నారు.