ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు.ముందుగా తిరుపతి చేరుకున్నాక క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి జగన్ వెళ్తారని సమాచారం. అక్కడ బాధితులను పరామర్శించాక ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది.
నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. గాయాలపాలైన వారికి రుయా, స్విమ్స్ ఆస్ప్రతిలో చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు విచారణ చేపట్టారు. కాగా,ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తిరుపతికి వస్తుండటంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సమాచారం.