తిరుమల తిరుపతి దేవస్థానానికి సమానంగా శ్రీ శైలం పుణ్య క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.ఈ క్రమంలోనే ప్రసాదం స్కీమ్ పర్యాటక రంగం నుంచి ఇప్పటికే రూ. 100 కోట్లు మంజూరు చేసింది. శ్రీశైలం అభివృద్ధికి వేల ఎకరాల భూమి అవసరం పడుతుందని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది.
ఇరిగేషన్ శాఖ నుంచి రావాల్సిన భూమిపై ఇప్పటికే చర్చలు సైతం జరిపింది. భూములు బదిలీ చేయాలని కేబినెట్‌లోనూ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన విషయాలను తాజాగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమల టెంపుల్ తరహాలోనే శ్రీ శైలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.త్వరలోనే కీలక అడుగులు పడే అవకాశం ఉందని ఆనం తెలిపారు.