పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై అమెరికా మరోసారి ఆంక్షలను విధించింది. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్‌తో విరుచుకపడిన విషయం తెలిసిందే. అయితే, ఆ దాడులకు ప్రతీకారంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఈ విషయాన్ని ప్రకటించింది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా ఈ చర్యకు పూనుకుంది.ఇరాన్‌కు నిధులు సమకూర్చే సామర్థ్యాన్ని దెబ్బకొట్టేలా అమెరికా నిర్ణయాత్మక చర్య తీసుకుంది.ఇరాన్‌కు చెందిన పెట్రోలియం,పెట్రోకెమికల్ రంగాలపై అమెరికా ఆంక్షలను మరింత విస్తరించింది. ఇక, ఈ క్రమంలోనే 16 సంస్థలను, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్టీగా గుర్తించినట్లు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇవి నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి మద్దతుగా ఇరానియన్ పెట్రోలియం,పెట్రోకెమికల్ ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు ఆరోపించింది.