ఢిల్లీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చుకునేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక మంత్రి వెల్లడించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమాశంలో కార్మిక శాఖ మంత్రి మాట్లాడారు. నిరుద్యోగుల కోసం ప్రత్యేక జాబ్ పోర్టర్ ను ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని కార్మిక శాఖ మంత్రి ప్రకటించారు.
నిరుద్యోగుల కోసం ప్రత్యేక జాబ్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని, దీంతో అనేక కంపెనీలను ఉద్యోగార్థులను ఒకే చోటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ఎంతో ఉపమోగపడుతుందన్నారు. నిరుద్యోగ సమస్య తగ్గితే ఆర్థిక వ్యవస్థ కొంత మేరకు మెరుగుపడుతుందన్నారు. ఇతర వివరాలను సీఎం కేజ్రీవాల్ త్వరలో వెల్లడిస్తారని, అప్పటి వరకూ వేచి ఉండాలని కార్మిక శాఖ మంత్రి తెలిపారు. కాగా, ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం 12 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు.