జర్నలిస్టుల కోసం కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ ఈటల స్పెషల్ రిక్వెస్ట్

-

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ను బీజేపీ కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఢిల్లీలోని కేంద్రమంత్రి నివాసంలో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు వినతిపత్రాలను కేంద్రమంత్రికి అందజేశారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు RUB, ROB పనులను అభివృద్దికి విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు.దీనికి తోడు మేడ్చల్ రైల్వే స్టేషన్లో పలు రైళ్ళను నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలని కోరారు. అనంతరం రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై సైతం వారిద్దరి మధ్చ చర్చ జరిగినట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news