మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి’ అంటారు. అలాగే భిష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఆయన పేరున ఈ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి’ అని పిలుస్తారు. ‘జయ ఏకాదశి, ‘మహాçఫల ఏకాదశి’ అని కూడా అంటారు. గంగామాత స్త్రీరూపంలో దరించినపుడు అష్టవసువుల్లో ఆమెకు పుట్టిన ఏడవ కుమారుడే భీష్ముడు.
58 రోజులపాటు అంపశయ్యపై..
యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి, గాయపడి 58 రోజుల పాటు అంపశయ్యపై పడుకొని, దక్షిణాయన కాలంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తాడు. అలా తన నిర్యాణానికి తనే సమయం నిర్ణయించుకున్న మహాపురుషుడు. ఆ సమయంలో ఆయన్ని చూడటానికి వచ్చిన కృష్ణుని చూసిన అమితానందంతో వేయి నామాలతో కీర్తిస్తాడు. విష్ణుసహస్త్ర నామాలను పటిస్తాడు. అలా మాఘశుద్ధ అష్టమినాడు పరమపదిస్తాడు. భారతదేశంలో భీష్మునిది ప్రత్యేక పాత్ర. చిన్ననాటి నుంచే ఆయన త్యాగశీలి. తండ్రి కోసం స్వసుఖాన్ని, రాజ్యాన్ని వదులుకుంటాడు. కొంతకాలం తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరిస్తాడు. తండ్రి సుఖం కోసం వారసత్వ హక్కైన రాజ్యాన్ని త్యాగం చేసిన తరువాత భవిష్యత్తులో తన సంతానం ఉల్లంఘిస్తారేమోన న్న అనుమానంతో వివాహాన్నే వద్దనుకున్నాడు.
భీష్మ ఏకాదశినాడు విష్ణుసహస్రనామం పఠిస్తే పుణ్యం కలుగుతుంది అంటారు. అనుకున్న పనులు విఘ్నాలు లేకుండా నెరవేరుతాయని, భోగభాగ్యలు కలిగి, పాపాలు హరిస్తాయి. గ్రహదోషాలు ఉన్నవారు విష్ణుసహస్రనామాన్ని పఠిస్తే విముక్తి కలుగుతుందంటారు. అందుకే భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. లేకపోతే శ్రీరామ రామ .. శ్లోకాన్ని మూడుసార్లు జపించండి.
ఆ రోజు చేయాల్సిన నియమాలు
పెద్దగడ్డంతో, తెల్లని మొఖం, నిలువునామాలు పెట్టి నిత్యం విష్ణువునే స్మరిస్తాడు. తనకు స్వచ్చంద మరణం అనే వరాన్ని తండ్రి శంతనుడి నుంచి పొందాడు. చిక్కుడు కాయలను తీసుకుని పుల్లతో భీష్ముడి రథాన్ని తయారుచేసి, పొంగాలి వండి సూర్యునికి నైవేద్యం పెట్టాలి. అలా చేస్తే విష్ణుసహస్రనామం నిత్యం పటించాలనే ఉద్దేశం కలుగుతుంది. దీని వల్ల అన్ని కోరికలు తీరతాయి. ఈ ఏకాదశి రోజు విష్ణుసహస్రనామం పటించండి. అలాగే భీష్మ అష్టమి నాడు ఆయనకు తర్పణం వదలాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ఏ దేవుడికి చేయని విధానం ఆయనకే కలిగిన భాగ్యం.