రాఫెల్ యుద్ధ విమానం ప్రత్యేకతలు ఇవే..?

-

ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానాల కంటే మరి ఇంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు మరికాసేపట్లో భారత అమ్ములపొదిలో చేరనున్నాయి.ఈ యుద్ధ విమానాలు భారత వైమానిక దళం లో చేరడంతో భారత వైమానిక దళం మరింత శక్తివంతంగా మారుతుంది. భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్ బేస్ స్టేషన్ లో ఈ యుద్ధ విమానాలు ల్యాండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ యుద్ధ విమానాల కంటే అత్యాధునిక టెక్నాలజీతో ఈ యుద్ధ విమానాలను తయారు చేయడం… దీనికోసం అతి ఎక్కువగా… ఖర్చు చేయడంతో ప్రస్తుతం ఈ రకాల యుద్ధ విమానాల అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. విమానాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి సహా వైమానిక దళ అధినేత రాకేష్ కుమార్ కొంతమంది ఉన్నత అధికారులు స్వాగతం పలికనున్నట్లు తెలుస్తోంది.

అయితే మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలకు భారత్ ఆర్డర్ చేయగా తొలి బ్యాచ్ లో భాగంగా ఐదు రకాల యుద్ధ విమానాలను అందించింది ఫ్రాన్స్ . ఇంతకీ దేశవ్యాప్తంగా ఆసక్తి కరం గా మారిన ఈ రఫెల్ యుద్ధ విమానాల్లో… ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రస్తుతం ఎంతో మందికి ఆసక్తికరంగా మారింది. అవేంటో తెలుసుకుందాం రండి

ట్విన్స్ ఇంజన్స్.. నెక్ట్ జెన్ టెక్నాలజీస్ ఇంజన్ గల విమానాలు.. ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలానికి గగనతలం నుంచి ఘఘనతలానికి లక్ష్యాలను సులభంగా చేదించగలవు. క్షిపణులను ప్రయోగించి విధ్వంసం సృష్టించగలవు . అయితే ప్రపంచంలోనే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మొట్టమొదటి యుద్ధవిమానం ఇదే కావడం గమనార్హం. అంతే కాకుండా విజువల్ రేంజ్ లో ఉన్న అన్ని లక్షణాలను కూడా సులభంగా చేదించగలవు ఈ రఫెల్ యుద్ధ విమానం.

ఇంధనం.. ఒకసారి రఫెల్ విమానం నిండా ఇంధనం నింపుకుంది అంటే 3,700 కిలోమీటర్ల వరకు దూసుకుపోయే సామర్థ్యం కలిగి ఉంది. అంతేకాదు ఈ విమానం నింపుకోవడానికి భూమ్మీద ల్యాండ్ చేయాల్సిన అవసరం లేదు గాలిలోనే నింపుకునేందుకు అవకాశం ఉంటుంది. శీతల పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ విమానాలు లక్ష్యాన్ని ఛేదించగలవు.

భారీగా బరువును మోయగల సత్తా… రఫెల్ యుద్ధ విమానాలకు ఏకంగా తొమ్మిది టన్నుల బరువును కూడా అవలీలగా మోయగల సత్తా ఉండేవిధంగా అధునాతన టెక్నాలజీతో రూపొందింది . ఎంతో యుద్ధ సామాగ్రిని సైతం ఈ యుద్ధ విమానాలు మోయగలవు.

15 మీటర్ల పొడవుతో … ఈ యుద్ధ విమానం పొడుగు 15.30 మీటర్లు కాగా దీని రెక్కలు 10.90 మీటర్లు ఉంటాయి. ఇక మొత్తంగా దీని బరువు పది టన్నుల వరకు ఉంటుంది.ల్యాండింగ్ తీసుకునే సమయానికి 24.5 టన్నుల బరువు మోసే సామర్థ్యం ఉండగా… ఈ యుద్ధ విమానం ఇంధన ట్యాంక్ 4.7టన్నులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version