పోషకాల బచ్చలి…ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుందా..!

-

ఆకుకూరలు..ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికి తెలుసు. అందులో బచ్చలి కూర..ఇది అయితే ఊర్లలో భలే పాకేస్తుంది. గోడలకు, తీగలకు విరివిగా వస్తుంది. కొనే అవసరం లేదని..ఇందులో ఏముంది అనుకుంటున్నారేమో..ఎన్నో పోషకాలు ఈ ఆకుకూరలో ఉన్నాయి. విటమిన్‌ ఏ, బీ, సీ, ఐరన్‌, క్యాల్షియం వంటి ఖనిజాలు ఈ బచ్చలికూరలో సమృద్ధిగా ఉన్నాయి. ఈరోజు ఈ ఆకుకూరలో ఉన్న ఆరోగ్యప్రయోజనాలు ఏంటో చూద్దాం.

1. బచ్చలిఆకు..కళ్ళు, మెదడు, గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

2. ఈ ఆకులో ఉండే రెటినోల్ కంటి చూపును పెంచేందుకు తోడ్పడుతుంది.

3. కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలంటే బచ్చలి తీసుకోవటం ఉత్తమైన మార్గం.

4. సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల భారి నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

5. చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

6. మలబద్దకం సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఈ ఆకు ఉపకరిస్తుంది.

7. అంతే కాకుండా సిలోన్ బచ్చలి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఇందులోని పీచు వల్ల బరువు కూడా తగ్గుతారట.

8. కేటరాక్ట్ మీ కంటి కండరాల బలహీనతని తగ్గిస్తుంది. వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలకు చాలా మంచిది.

9. కిడ్నీ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉండాలన్నా, కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలన్నా బచ్చలి కూర తినటం మేలు.

10. క్యాల్షియం సమృద్ధిగా ఉండే బచ్చలిని క్రమం తప్పకుండా తింటే..ఎముకలు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

11. రక్త హీనత సమస్యతో బాధపడే వారు బచ్చలి కూర తినటం వల్ల స్వల్పకాలంలో ఆ సమస్య నుండి ఉపసమనం పొందవచ్చు.

12. బచ్చలిలో ఉండే సాఫోనిన్ పదార్ధం క్యాన్సర్ వంటి సమస్యలను దరి చేరకుండా కాపాడుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.

13. బచ్చలికూర ఆహారంగా తీసుకోవటం వల్ల రక్త ప్రవాహాం మెరుగవుతుంది. రక్తపోటును తగ్గించటంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.

14. ఒత్తిడిని తగ్గించటంలో సైతం ఈ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మెదడు డ్యామేజి కాకుండా కాపాడతాయి.

15. బచ్చలికూరలో ఉండే…ఐరన్ రక్తాన్ని వృద్ధి చేయటంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు వారానికి మూడుసార్లు ఈ కూరను
తీసుకోవటం ఆరోగ్యపరంగా చాలా మంచిదని వైద్యులు అంటున్నారు.

ఇన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్న బచ్చలికూరను వీలైనప్పుడల్లా తినేయండి మరీ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version