పారిస్ ఒలింపిక్స్ కు 117 మంది భారత అథ్లెట్లు

-

ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా భారత అథ్లెట్ల అసోషియేషన్ ఓ స్టేట్మెంట్ను విడుదల చేసింది. అందులో భారత తరఫున వివిధ క్రీడల్లో పాల్గొననున్న 117 మంది ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు. భార‌త బృందంలో 72 మందిని మాత్రమే ప్ర‌భుత్వం త‌న ఖ‌ర్చుల‌తో పంపించనున్నట్లు పేర్కొంది. క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది వెళ్లనున్నట్లు తెలిపింది.

భారత్ నుంచి వెళ్లనున్న ప్లేయర్ల జాబితా ఇదే

అథ్లెటిక్స్ – 29 (11 మ‌హిళ‌లు, 18 పురుషులు )

షూటింగ్‌ – 21

హాకీ – 19

టేబుల్ టెన్నిస్‌ -8

బ్యాడ్మింట‌న్‌ -7

రెజ్లింగ్‌ 6

ఆర్చ‌రీ – 6

బాక్సింగ్‌ – 6

గోల్ఫ్ – 4

టెన్నిస్‌ – 3

స్విమ్మింగ్‌ -2

సెయిలింగ్‌ -2

ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత బృందంలో చంఢీగడ్ యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. అందులో అర్జున్‌ బబుటా(షూటింగ్‌), భజన్‌ కౌర్‌(ఆర్చరీ), రితిక హుడా (రెజ్లింగ్‌), సంజయ్‌ (హాకీ), అక్ష్‌దీప్‌ సింగ్‌ (రేస్‌ వాకింగ్‌), యశ్‌ (కయాకింగ్‌)లతో పాటు పారాలింపియన్లు పలక్‌ కోహ్లీ (బ్యాడ్మింటన్‌), అరుణ తన్వర్‌ (తైక్వాండో) ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version