Naveen Polishetty: నవీన్ పొలిశెట్టికి ప్రమాదం..!

-

టాలీవుడ్‌ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి తెలియని వారుండరు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాల గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గుర్తుకు వస్తాడు. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో, తనదైన టైమింగ్ తో కథలకి ప్రాణం పోస్తూ…. సక్సెస్ లు అందుకుంటున్న ఈ యువ హీరోకి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. టాలెంటెడ్ యాక్టర్ అనే గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు.

Naveen Polishetty Fighting Back After Injuries

ఇక నవీన్ పోలిశెట్టికి దర్శకనిర్మాతలు పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారంటే ఇతనికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నేచురల్ స్టార్ నాని తర్వాత తనదైన నేచురల్ పర్ఫామెన్స్ తో నవీన్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. తన అద్భుతమైన సినిమాలతో యూత్ కి కనెక్ట్ అయ్యాడు. అయితే.. MissShettyMrPolishettyతో బ్లాక్‌బస్టర్‌ను అందించిన యువ సంచలనం..ఈ మధ్య కాలంలో మీడియాలో బయట కనిపించలేదు. ఇటీవల నవీన్‌ చేయికి గాయం అయిందట. అందుకే నవీన్‌ ఎవరినీ కలువలేదని సమాచారం. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version