బిలియన్ల మంది ప్రజల భద్రత, శ్రేయస్సు, ఆరోగ్యానికి సారవంతమైన భూమి చాలా అవసరమని UN సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ అన్నారు. ఈ భూములు ప్రజల జీవితాలకు, పర్యావరణానికి తోడ్పడతాయి, కాని మనం మనల్ని పోషించే భూమిని నాశనం చేస్తున్నామని ఆయన అన్నారు. మనిషి ఇప్పటికే తన సుఖం కోసం చెరువులను తవ్వి ఇళ్లు కడుతున్నాడు. చెట్లను నరికి రోడ్లు వేస్తున్నారు. కొండలను తవ్వి భవనాను నిర్మిస్తున్నారు. ఇలా పర్యావరణాన్ని తన స్వార్థం కోసం పాడుచేస్తూనే ఉన్నాడు. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రతి సెకనుకు నాలుగు ఫుట్‌బాల్ మైదానం అంత భూమి నాశనం అవుతుందని తెలిపింది.. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం.
ఐక్యరాజ్యసమితి ప్రకారం, భూమిపై 40 శాతం భూమి క్షీణిస్తోంది. ప్రతి సెకనుకు ఎక్కువ హెక్టార్లను (చాలా పెద్ద భూభాగం) కోల్పోతున్నాము, ప్రతి సెకనుకు విలువైన నాలుగు ఫుట్‌బాల్ మైదానాలు క్షీణించబడుతున్నాయి ఐక్యరాజ్యసమితి ప్రకారం.. ప్రతి సెకనుకు 100 మిలియన్ హెక్టార్లకు సమానమైన భూమిని కోల్పోతున్నట్లు తెలిపింది. ఆరోగ్యవంతమైన భూమి మన ఆహారాన్ని 95 శాతం అందిస్తుంది, ప్రజలకు ఆశ్రయం కల్పిస్తుంది, ఉద్యోగాలను అందిస్తుంది మరియు జీవనోపాధికి చాలా ముఖ్యమైనది.
ఐక్యరాజ్యసమితి ప్రకారం, కరువు మరియు ఎడారీకరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం, ‘దేశం, మన వారసత్వం, మన భవిష్యత్తు’ అనే థీమ్‌తో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకునే ప్రధాన కార్యక్రమాన్ని జర్మన్ ప్రభుత్వం బాన్‌లోని ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక అయిన బుండెస్‌కున్‌స్టాల్‌లో నిర్వహించనుంది. మానవ మనుగడుకు భూమి, నీరు, గాలి, ఆహారం చాలా ముఖ్యం. వీటికి కొరత ఏర్పడినప్పుడు మనుషులు దోచుకోవడానికి కూడా వెనకాడరు. ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా రాష్ట్రాల్లో దోపిడీలు పెరుగుతున్నాయి. ఎదుటివారి ప్రాణం కంటే మన ప్రాణం చాలా విలువైనది అనుకోని ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాడినికి మన వంతు ప్రయత్నం చేయాలి. పచ్చని చెట్లను నరికి చేసే ఏ పని అయినా ఆ భూమాతను క్షోభపెడుతుందని గుర్తుంచుకోండి.