Viral : ఒకే ఓవర్లో 6 వికెట్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన బౌలర్..

-

నేపాల్‌ ప్రో క్లబ్‌ ఛాంపియన్‌ షిప్‌ లో భాగంగా పుష్‌ స్పోర్ట్స్‌ ఢిల్లీ, మలేషియా క్లబ్‌ ఎలెవెన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ లో మలేషియా ఎలెవెన్‌ స్పిన్నర్‌ విరన్‌ దీప్‌ సింగ్‌ ఆఖరి ఓవర్‌ వేశాడు. తొలి బంతిని వైడ్‌ గా వేసిన విరన్‌ దీప్‌.. ఆ తర్వాత వేసిన లీగల్‌ బంతికి ఓ బ్యాటర్‌ రనౌట్‌ అయ్యాడు. ఆ పై వేసిన ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులోనే వీరన్‌ దీప్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసాడు.

హ్యాట్రిక్‌ సాధించిన తర్వాత అతడు సెలబ్రేషన్‌ చేసుకున్నాడు. విరన్‌వేసిన చివరి ఓవర్‌ లోపుష్‌ స్పోర్ట్స్‌ ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌ లో వీరన్‌ దీప్‌ రెండు ఓవర్లు వేసి.. 8 పరుగులిచ్చి.. 5 వికెట్ల తీశాడు.

చివరి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు పడగొట్టిన విరన్‌ దీప్‌.. హ్యట్రిక్‌ ఖాతాలో వేసుకున్నాడు. విరన్‌ దీప్‌ తీసిన ఐదు వికెట్లలలో బోల్డ్‌, క్యాచ్‌ ఔట్లు ఉన్నాయి. స్పిన్నర్‌ విరన్‌ దీప్‌ దెబ్బకు 131-3 ఉన్న స్పోర్ట్స్‌ ఢిల్లీ స్కోర్‌ చివరకు 132-9 గా మారింది. ఈ మ్యాచ్‌ లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 132-9 స్కోర్‌ చేయగా… ఛేదనలో మలేషియా 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version