మెల్ బోర్న్ వేదికగా జరుగనున్న నాలుగో టెస్ట్ కి ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కే.ఎల్. రాహుల్ గాయాల కారణంగా గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశముంది. శనివారం కే.ఎల్. రాహుల్ చేతికి గాయం కాగా.. ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయం అయింది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ.. వారు టెస్ట్ కి దూరం అయితే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమానంగా కొనసాగుతోంది.
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగే నాలుగో టెస్ట్ కి అత్యంత కీలకం కానుంది. కే.ఎల్. రాహుల్ దూరం అయితే అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ ఎంపిక చేసే అవకాశాలున్నాయి. దేశీయ క్రికెట్ తన అద్భుతమైన ప్రదర్శనతో ఈశ్వరన్ జాతీయ జట్టుకు తన పేరు వినిపించారు. ఇప్పటివరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 48.87 సగటుతో 7674 పరుగులు చేసిన ఈ కుడిచేతి బ్యాట్స్ మన్ 27 సెంచరీలు, 29 అర్థ సెంచరీలతో తన సత్తా చాటాడు. ఇంకా అంతర్జాతీయ క్రికెట్ లో అతను ఆరంగేట్రం చేయాల్సి ఉంది.