స‌య్య‌ద్ మోడీ టోర్నీ ఫైన‌ల్లో సింధు విజ‌యం

స‌య్యద్ మోడీ ఓపెన్ సూప‌ర్ – 300 బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్ మ‌హిళ‌ల సింగిల్స్ విజేత గా భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు నిలిచింది. స‌య్య‌ద్ మోడీ టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్ లో పీవీ సింధు విజ‌య డంక మోగించింది. దీంతో దీంతో సయ్య‌ద్ మోడీ టోర్నీ విజేతగా పీవీ సింధు నిలిచింది. ఈ రోజు జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో మాళవిక బ‌న్సోద్ ను పీవీ సింధు వ‌రుస సెట్ ల‌లో మ‌ట్టి క‌రిపించింది. 21 – 13, 21- 16 తేడాతో ఫైన‌ల్ మ్యాచ్ లో మాళ‌విక మ‌న్సోద్ ను పీవీ సింధు ఓడించింది.

పీవీ సింధు | PV Sindhu
పీవీ సింధు | PV Sindhu

కాగ శ‌నివారం స‌య్య‌ద్ మోడీ టోర్నీ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో ఈవ్ జెనియా కొసెత్స్ క‌యా గాయం కార‌ణంగా రిటైర్డ్ హ‌ర్ట్ అయింది. దీంతో స‌య్య‌ద్ మోడీ టోర్ని నిర్వ‌హ‌కులు పీవీ సింధును నేరుగా ఫైన‌ల్ మ్యాచ్ కు పంపించారు. దీంతో నేడు పీవీ సింధు ఫైన‌ల్ మ్యాచ్ ఆడింది. కాగ రెండు సార్లు ఒలింపిక్ ప‌త‌కాల‌ను అందుకున్న తెలుగు తేజం పీవీ సింధు.. ప్ర‌స్తుతం స‌య్య‌ద్ మోడీ టోర్నీ ని కూడా కైవ‌సం చేసుకుంది.