No No No.. అది పీడకల అయితే బాగుండు: ఆనంద్ మహీంద్రా

-

పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి రికార్డు క్రియేట్ చేసి రెజ్లింగ్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌కు అనుకోని షాక్ తగిలింది. భారతీయల ఆశలు కొల్లగొడుతూ.. పతక రేసులో ఉన్న ఆమెపై అనూహ్యంగా అనర్హత వేటు పడింది. ప్రతి భారతీయుడిని ఈ నిర్ణయం షాక్‌కు గురిచేసింది. దీనిపై ప్రధాని సహా పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా తన స్పందన తెలియజేశారు. ఈ నిర్ణయం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘నోనోనో.. ఇది పీడకల అయితే బాగుండు. ఇది నిజం కాకపోతే బాగుండు’’ అని పోస్టు పెట్టారు.

ఫైనల్‌ సమయంలో రెజ్లర్‌పై వేటు పడటంతో మరో ఫైనలిస్ట్‌కు గోల్డ్ మెడల్ దక్కనుంది. సిల్వర్‌ మెడల్‌ను మాత్రం ఎవరికీ కేటాయించరు. రెండు కాంస్య పతకాల్లో ఒక దానికోసం సెమీస్‌లో ఓడిన ఇద్దరు రెజర్లు తలపడాల్సి ఉంటుంది. మరొకటి రెపిఛేజ్‌ రౌండ్‌లో ఢీకొట్టుకొని విజేతగా నిలిచిన రెజ్లర్‌కు దక్కనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version