వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ధర్మశాలలో న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లో గిల్ ఈ రికార్డు సృష్టించాడు. భారత బ్యాట్స్‌మెన్ 40 ఇన్నింగ్స్‌లలో ఈ సంఖ్యను తాకిన దక్షిణాఫ్రికా మాజీ లెజెండ్ హషీమ్ ఆమ్లాను అధిగమించాడు. అయితే గిల్ ఈ ఫీట్‌ను 38 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో పాక్ మాజీ లెజెండ్ జహీర్ అబ్బాస్, ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్.
ప్రస్తుత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, దక్షిణాఫ్రికా ప్రస్తుత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాస్సీ వాన్ డెర్ డుస్సేన్ ఉన్నారు. ఈ బ్యాట్స్‌మెన్‌లందరూ వన్డేల్లో 2000 పరుగుల సంఖ్యను చేరుకోవడానికి 45 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. అయితే గిల్ అందరినీ ఓడించి ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు.శుభ్ మన్ గిల్ సరికొత్త రికార్డును సృష్టించేందుకు చాలా కష్టపడ్డాడనే చెప్పాలి. ఇక అభిమానులు శుభ్ మన్ ను పొగడ్తలతో ముంచెత్తారు.