NANI NEW MOVIE:”సరిపోదా శనివారం” మూవీ ఫస్ట్ గ్లిమ్ పస్ వీడియో !

-

ఈ రోజు దసరా కానుకగా నాని మరియు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రానున్న కొత్త మూవీ గ్లిమ్పస్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు టైటిల్ గా “సరిపోదా శనివారం” అంటూ చాలా కొత్తగా ప్లాన్ చేశారు అని చెప్పాలి. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “అంటే సుందరానికి” మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది.. ఇక అంతకు ముందు వివేక్ ఆత్రేయ తెరెక్కించిన మెంటల్ మదిలో మరియు బ్రోచేవారెవరురా సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. టేకింగ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకుని సైలెంట్ గా సంచలనాలు సృష్టిస్తుంటాడు ఆత్రేయ. ఇక ఈ సినిమా గ్లిమ్ పస్ వీడియో కూడా సాయి కుమార్ బ్యాక్ గ్రౌండ్ డైలాగులతో నాని సంకెళ్ళ మధ్య బంధిపబడి ఉన్న సీన్ తో ఆసక్తికరంగా కట్ చేశాడు.

కొత్త పాయింట్ ను తీసుకున్నట్లే కనిపిస్తున్నా ఈమేరకు సబ్జెక్టు న్యాయం చేస్తాడన్నది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. ఇందులో నాని సరసన ప్రియాంక ఆర్క్ మోహన్ నాయకిగా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version