యాషెస్ సిరీస్ : భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్ … కంగారూలకు కష్టమే !

-

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆఖరి టెస్ట్ లో ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా లు తలపడుతున్నాయి. మూడవ రోజు ఆటలో ఇంగ్లాండ్ కమాండింగ్ పొజిషన్ లో ఉంది అని చెప్పాలి. మూడవ ఇన్నింగ్స్ జరుగుతుండగా ఇంగ్లాండ్ తమ లీడ్ ను ఇంకా పెంచుకుని ఆస్ట్రేలియా పై ఒత్తిడి పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 265 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ లో క్రాలీ 73, డక్కెట్ 42, స్టోక్స్ 42, రూట్ 61*, బైర్ స్టో 34 * లు కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడి భారీ ఆధిక్యాన్ని సాధించే దిశగా టీం ను తీసుకువెళుతున్నారు. మరో రెండు రోజులు మిగిలి ఉండడంతో ఇంగ్లాండ్ ఈ రోజు మొత్తం ఆడి రేపు ఉదయం సెషన్ ను కూడా ఆడి భారీ టర్గెట్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచడానికి ప్లాన్ చేస్తున్నారు.

రెండవ ఇన్నింగ్స్ ఆధిక్యం 400 పరుగులు దాటితే ఛేదించడం చాలా కష్టం అవుతుంది. తద్వారా ఆస్ట్రేలియా మ్యాచ్ ను ఓడిపోయి సిరీస్ 2 – 2 తో సమం అవుతుంది .

Read more RELATED
Recommended to you

Exit mobile version