అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌ ఘోర పరాజయం !

-

Australia won by 10 wkts: డే/నైట్ టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది.. 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-1తో సమం అయింది.. డే/నైట్ టెస్టులో భారత్ బ్యాటర్లు, బౌలర్లు.. పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

Australia won by 10 wkts

 

ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 180 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 337 పరుగులకు… ఆల్ అవుట్ అయింది.దీంతో 155 పరుగులకు పైగా..లీడ్ సంపాదించింది ఆస్ట్రేలియా. ఇక రెండో వైనింగ్స్ ప్రారంభించిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్ కంటే దారుణంగా విఫలమైంది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో 175 పరుగులకు ఆల్ అవుట్ కావడం జరిగింది టీమిండియా.

ఇక 19 పరుగులను అవలీలగా సాధించి 10 వికెట్ల తేడాతో టీమిండియా పై గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆస్ట్రేలియా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-1 తేడాతో సమం చేసింది ఆస్ట్రేలియా. ఇక టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్.. లో రోహిత్ సేన ఓటమితో డబ్ల్యూటీసి పాయింట్స్ టేబుల్ లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రెండవ టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా మొదటి స్థానానికి వచ్చింది. ఓడిన టీమ్ ఇండియా మాత్రం మూడవ స్థానానికి పడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news