ప్రస్తుత సమాజంలో బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మసకబారుతున్నాయి. పెద్దలు అనే గౌరవం ఉండటం లేదు. ఇక కుటుంబంలోని వృద్ధులకు బుక్కెడు తిండి పెట్టేందుకు ఇంటి కోడళ్లు నానా చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా తన సొంత మామపై ఓ ఇంటి కోడలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడింది.
వీల్ చైర్‌కు పరిమితమైన మామపై కోడలు చెప్పుతో దాడికి పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వృద్ధుడైన తన మామపై కోడలు చెప్పుతో మొహంపై పదే పదే దాడికి పాల్పడగా పాపం ఆ వృద్ధుడు కొట్టొద్దని తెగ ప్రాధేయపడ్డాడు. కాళ్లు పట్టుకొని వేడుకున్నా కోడలు కనికరించలేదు. మామపై కోడలు దాడి చేస్తుండగా ఆ ఇంట్లోని పెంపుడు కుక్క సైతం వృద్ధుడిని కొట్టొదని గట్టిగా అరుస్తూ వారించింది. అయినా, ఆమె హృదయం కరుగలేదు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మామ పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసిన కోడలు
నల్గొండ – వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామ పై విచక్షణారహితంగా దాడికి చేసిన కోడలు..
వీల్ చైర్లో ఉన్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో దాడి.. కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించని కోడలు. pic.twitter.com/EmWqLsTfLw
— Telugu Scribe (@TeluguScribe) December 8, 2024