టీమ్ ఇండియా ఆటగాళ్లకు కొత్త రూల్స్ పెట్టింది బీసీసీఐ పాలక మండలి. టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకుని… టీమ్ ఇండియా ఆటగాళ్లకు కొత్త రూల్స్ పెట్టింది. డొమెస్టిక్ మ్యాచ్ లు తప్పనిసరి గా ఆడాలని… టీమ్ తో పాటే ట్రావెల్ చేయాలని ఆదేశించింది బీసీసీఐ.
వ్యక్తిగత సిబ్బంది కి అనుమతి లేదని… టూర్ లో వెంట కుటుంబ సభ్యులు వస్తే.. వాళ్ళతో సస్పెండ్ చేసేందుకు టైం లిమిట్ పెట్టింది. బీసీసీఐ షూట్ లో మాత్రమే పాల్గొనాలని వివరించింది. టోర్నీ మొత్తం క్రికెటర్లతో కలిసి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఉండటానికి వీలు లేదని కూడా వివరించింది బీసీసీఐ. 15 నుంచి 20 రోజుల పాటు జరిగే టూర్స్ ఐతే… క్రికెటర్లతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ 7 రోజులు మాత్రమే కలిసి ఉండాలని ఆదేశించింది. మ్యాచ్లు అనుకున్నదానికంటే ముందుగానే ముగిసినప్పటికీ, మ్యాచ్ సిరీస్ లేదా పర్యటన ముగిసే వరకు ఆటగాళ్లు తప్పనిసరిగా జట్టుతో పాటు ఉండాలి.
📢 THE BCCI RELEASES 10 NEW GUIDELINES FOR INDIAN PLAYERS. pic.twitter.com/5SXoPOrjz0
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 16, 2025