కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశంసలు కురిపించారు. భూభారతి చట్టం తీసుకువచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.

గత పదేళ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతులను ధరణి పేరుతో ఏడిపించిందని వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాం తెరపైకి వచ్చింది. దుబ్బాక నియోజకవర్గం చొదర్‌పల్లి గ్రామంలో దళితులు, వడ్డెరలకు చెందిన 176 ఎకరాలు కొట్టేసి 84 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తన కూతురు మాదవనేని సింధు, భార్య మాదవనేని మంజుల పేరిట బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పట్టాలు చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశంసలు కురిపించారు.