ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ టోర్నమెంట్ కంటే ముందు.. బుమ్రా దూరం కాబోతున్నట్లు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటన చేసింది. వెన్ను నొప్పి తీవ్రతరం కావడంతో… ఈ టోర్నమెంటు నుంచి బుమ్రా ను తప్పించినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Jasprit-Bumrah-has-been-ruled-out-of-the-2025-ICC-Champions-Trophy-due-to-a-lower-back-injury.jpg)
అతని స్థానంలో… హర్షిత్ రానా ను సెలెక్ట్ చేశారు. అలాగే జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని సెలెక్ట్ చేసింది బీసీసీఐ పాలకమండలి. జైస్వాల్ అలాగే మహమ్మద్ సిరాజ్, శివం దూబే నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్ గా ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా వెల్లడించింది. ఈ ముగ్గురు ప్లేయర్లు అవసరం అయితేనే దుబాయ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. 15 మంది జట్టు సభ్యుల లిస్టులో ఈ ముగ్గురు ఉండబోరు. 15 మందిలో.. ఎవరైనా గాయాల బారిన పడితే తప్ప వీళ్లకు ఛాన్స్ రాదు.