IPL 2023: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన CSK…ఏకంగా పదో సారి ఫైనల్‌కు

-

గుజరాత్ పై చెన్నై 15 రన్స్ తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని GT చేదించలేకపోయింది. ఈ మ్యాచ్ లో గెలవడంతో చెన్నై ఫైనల్ కు చేరగా, ఎలిమినేటర్ లో గెలిచే జట్టుతో GT క్వాలిఫైయర్-2 లో తలపడనుంది.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది. ఈ సీజన్ తో కలిపి ఇప్పటివరకు మొత్తం 14 సీజన్ లలో 10సార్లు ఫైనల్ కు వెళ్ళింది. 4సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై… అత్యధికంగా 12 సార్లు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018, 2019, 2021, 2023 సీజన్లలో ఫైనల్ కు చేరింది. కాగా, ఈ మ్యాచ్‌ లో . గిల్ 42, రషీద్ 30 రన్స్ తో రాణించిన GT 157 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. సీఎస్కే బౌలర్లలో చాహార్, తీక్షణ, జడేజా, పతిరన తలో 2 వికెట్లు, తుషార్ ఒక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version