బంగ్లాదేశ్ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంగ్లా మాజీ కెప్టెన్‌కు గుండెపోటు చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.