ఇంగ్లాండ్ కు ఐసీసీ షాక్ : డబ్యూటీసీ లో 8 పాయింట్లు కోత

-

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్లో ఓవ‌నెట్ కార‌ణం గా ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ పాయింట్ల ప‌ట్టిక లో ఇంగ్లాండ్ కు 8 పాయింట్ల కోత విధించింది. ఆస్ట్రేలియ తో జ‌రుగుతున్న యాషేస్ సిరీస్ లో భాగం గా మొద‌టి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ స్లో ఓవ‌ర్ నెట్ కు గురి అయింది. దీంతో ఐసీసీ మొద‌ట డబ్యూటీసీ పాయింట్ల టేబుల్ లో ఇప్ప‌టికే 5 పాయింట్ల కు కోత విధించింది. అలాగే మ్యాచ్ ఫీజు లో 100 శాతం జ‌రిమానా ను కూడా విధించింది. అయితే ఆ పాయింట్ల కోత ను 8 కి పెంచుతూ ఐసీసీ నిర్ణ‌యం తీసుకుంది.

కాగ టెస్ట్ మ్యాచ్ ల‌లో పరిమిత స‌మ‌యంలో నిర్ణ‌యించిన ఓవ‌ర్ల కంటే త‌క్కువ ఓవ‌ర్లు వేస్తే ఆ జ‌ట్టు కు ఐసీసీ చ‌ర్య‌లు తీసుకుంటుంది. అయితే ఎంత త‌క్కువ ఓవ‌ర్లు వేస్తే అంత ఎక్కువ శిక్ష ఉంటుంది. అయితే డబ్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక లో 8 పాయింట్ల కోత ప‌డ‌టంతో ప్రంప‌చ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఇంగ్లాండ్ దిగువ‌కు ప‌డిపోయింది. పాయింట్ల పట్టిక లో 5వ స్థానం నుంచి 7 వ స్థానికి ఇంగ్లాండ్ జ‌ట్టు ప‌డిపోయింది. కాగ పాయింట్ల ప‌ట్టిక లో శ్రీ‌లంక మొద‌టి స్థానం లో ఉంది. ఇండియా 4 వ స్థానం లో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version