రూ.4,500తో నెలకు రూ.51 వేలు పొందొచ్చు..!

-

చాలా మంది ఆర్ధిక ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని ముందు నుండి డబ్బులుని ఆదా చెయ్యడం, ఇన్వెస్ట్ చెయ్యడం జరుగుతుంది. అయితే పదవీ విరమణ పొందాక ఆర్ధిక సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే సురక్షితమైన పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెట్టడం అవసరం.

money

పదవీ విరమణ అయిన తర్వాత కూడా పెరుగుతోన్న ఖర్చులను తట్టుకునేలా పెట్టుబడి ఉండాలి. లేకపోతే చిక్కుల్లో పడతాం. అయితే మనకి వుండే స్కీమ్స్ లో ప్రభుత్వం నిర్వహిస్తోన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) చాలా చక్కటి స్కీమ్. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా అదిరే లాభాలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.

25 ఏళ్ల నుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, రూ.50 వేలకు పైనే నెలవారీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల నుంచి నెలనెలా రూ.4500ను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే, 35 ఏళ్ల తర్వాత 10 శాతం వడ్డీ రేటుతో మీ పదవీ విరమణ వయసులో రూ.51,682ను ప్రతీ నెలా పొందొచ్చు. ఎంత ఎక్కువ పెడితే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి.

25 ఏళ్ల నుంచి, తర్వాత 35 ఏళ్ల వరకు నెలనెలా ఎన్‌పీఎస్‌లో రూ.4,500ను మీరు పెట్టుబడి పెడితే మీకు 60 ఏళ్లు వచ్చే నాటికి మీ పెట్టుబడి మొత్తం రూ.18.90 లక్షలవుతుంది. దీనికి 10 శాతం కాంపౌండ్ ఇంటరస్ట్‌ను కలుపుకుంటే, మీరు పెట్టుబడిగా పెట్టిన మొత్తం 60 ఏళ్లు వచ్చే నాటికి రూ.1.72 కోట్లకు పెరుగుతుంది.

అలానే మీ మొత్తం కార్పస్‌లో 60 శాతం వరకు మాత్రమే విత్ డ్రా చేసుకోచ్చు. మిగిలిన 40 శాతానికి మీరు యాన్యుటీ ప్లాన్‌ను కొనచ్చు. 40 శాతం మొత్తాన్ని విత్ డ్రా చేసుకుని, 60 శాతంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేస్తే అప్పుడు 6 శాతం వడ్డీ లెక్కన నెలకు రూ.51,682 పెన్షన్ పొందవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version