ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ ఆటలో మునిగి తేలుతున్నారు. ఈ టోర్నీ ముగియగానే మరో మెగా వార్ క్రికెట్ ఫ్యాన్స్‌ను పలకరించనుంది. అదే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ దిగ్గజ జట్ల మధ్య జూన్ 7-11 తేదీల్లో ఓవల్ మైదానం వేదికగా ఈ టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఇక ఈ మెగా ఫైనల్‌కు టీమ్‌ఇండియా జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇందులో మిస్టర్ 360గా పేరున్న సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించకపోవడం గమనార్హం. మరోవైపు తాజాగా జరుగుతున్న ఐపీఎల్‌లో చెన్నై తరఫున అదరగొడుతున్న రహానేను జట్టులోకి తీసుకుంది. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది.
భారత జట్టు ఇదే : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్‌గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్