ఐపీఎల్లో మ్యాచ్ ఆడుతుంది ఏ టీమైనా.. స్టేడియం ఏదైనా.. ఆ ప్రాంగణమంతా ధోనీ పేరుతో మార్మోగిపోవాల్సిందే. ఇక ధోనీయే రంగంలోకి దిగి బ్యాట్ పట్టాడంటే స్టేడియమంతా ఒక్కసారిగా ఉర్రూతలూగిపోతుంది. అందుకే ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడుతుందంటే రికార్డులు బద్దలు అవ్వడం పక్కా. తొలి క్వాలిఫయర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెపాక్ వేదికగా చెన్నై తలపడింది. అద్భుతమైన విజయం సాధించి సీఎస్‌కే ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో సూపర్ రికార్డు నమోదైంది.
ఛేదనలో చివరి ఓవర్లను అభిమానులు భారీ సంఖ్యలో వీక్షించారు. దీంతో వ్యూవర్‌షిప్ 2.5 కోట్ల మార్క్‌ను తాకింది. గతంలో (ఏప్రిల్ 17న) చెన్నై – ఆర్‌సీబీ మ్యాచ్‌కు 2.4 కోట్ల వ్యూవర్‌షిప్ వచ్చింది. జియో సినిమా తన ట్విటర్‌లో ఈ మేరకు పోస్టు పెట్టింది. ‘కీలకమైన నాలుగు మ్యాచుల్లో (ప్లేఆఫ్స్) ఆరంభంలోనే రికార్డును బ్రేక్ చేశాం. గుజరాత్ – చెన్నై మ్యాచ్‌ను అభిమానులు విశేషంగా ఆదరించారు’’ అని ట్వీట్ చేసింది.