శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

-

హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు తరచూ స్మగ్లర్లు పట్టుబడుతుంటారు. ప్రయాణికుల రూపంలో స్మగ్లర్లు అక్రమంగా బంగారం, విదేశీ కరెన్సీ తీసుకెళ్తూ దొరికిపోతారు. అధికారుల కళ్లుగప్పడానికి ఎన్ని మార్గాలు ఎంచుకున్నా.. చివరకు కస్టమ్స్ కంటికి చిక్కాల్సిందే.

తాజాగా శంషాబాద్ ఎయిర్​పోర్టులో కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ లైట్‌లో దాచి తీసుకొచ్చిన బంగారాన్ని తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ప్రయాణికుడి నుంచి దాదాపు రూ.1.82 కోట్లు విలువైన 2.915 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించామని.. అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version