IPL 2022 : మెగా వేలానికి డేట్ ఖ‌రారు

-

వ‌చ్చే ఏడాది జ‌రగ‌బోయే మెగా వేలానికి బీసీసీఐ డేట్ ఫిక్స్ చేసింది. బెంగ‌ళూర్ వేదికగా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో 7, 8 తేదీల‌లో IPL 2022 కి సంబంధించిన మెగా వేలం నిర్వ‌హిస్తార‌ని బీసీసీఐ కి చెందిన ఒక ప్ర‌ముఖ అధికారి తెలిపిన‌ట్లు స‌మాచారం. అయితే IPL 2022 కి సంబంధించిన మెగా యాక్ష‌న్ యూఏఈ లో జ‌రుగుతుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కానీ చివ‌రికి బెంగ‌ళూర్ వేదిక ను బీసీసీఐ ఫైన‌ల్ చేసింద‌ని బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువ ఉన్న నేప‌థ్యంలో బెంగ‌ళూర్ ను ఫిక్స్ చేశార‌ని తెలుస్తుంది.

కాగ ఇప్ప‌టికే కొత్త జ‌ట్లు అయిన అహ్మ‌దాబాద్, ల‌క్నో జ‌ట్ల కు ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకోవ‌డానికి గ‌డువు ను కూడా పొడ‌గించారు. అహ్మ‌దాబాద్ జ‌ట్టు కు కొన్ని స‌మ‌స్యలు ఏర్పాడ‌టం తో ఆట‌గాళ్ల ఎంపిక గ‌డువు ను పొడ‌గించార‌ని తెలుస్తుంది. అయితే లక్నో జ‌ట్టు మాత్రం IPL 2022 కి స‌ర్వం సిద్ధం చేస్తుంది. ఇప్ప‌టికే కోచ్ ను ఎంపిక చేసుకున్న ల‌క్నో జ‌ట్టు తాజా గా గంభీర్ ను మెంట‌ర్ గా కూడా ఎంపిక చేసుకుంది. అలాగే కెప్టెన్ గా కెఎల్ రాహుల్ ను మ‌రో ఆట‌గాడిగా ర‌హీద్ ఖాన్ ను కూడా జ‌ట్టు కు ఎంపిక చేసే అక‌శాలు ఉన్నాయ‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version