భూమికి మ‌రో ప్ర‌మాదం.. సౌర తుఫాన్లు వ‌చ్చే అవ‌కాశం

-

భూమికి మ‌రో ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అంత‌రిక్ష నాసా వాతార‌ణ భౌతిక శాస్త్ర వేత్త డా. త‌మిత స్కోవ్ అన్నారు. సూర్యుడి పై జ‌రుగుతున్న ప‌రిస్థితుల కార‌ణంగా సౌర తుఫాన్లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపారు. ఇప్ప‌టి ప‌రిస్థితుల‌ను చేస్తే.. రెండు సౌర తుఫాన్లు భూమి వైపు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని త‌మిత తెలిపారు. ఈ సౌర తూఫానులు అతి త్వ‌ర‌లోనే భూమిని తాకే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. అలాగే ఈ ఏడాదిలో దాదాపు ఐదు నుంచి ఆరు సౌర తుఫాన్లు భూమి వైపు దూసుకు వ‌చ్చి తాకాయ‌ని అన్నారు.

కానీ ఇవి చాలా చిన్న సౌర తుఫాన్లు కాబ‌ట్టి ప్ర‌మాదం ఎక్కువ సంభవించ‌లేద‌ని అన్నారు. కానీ రాబోతున్న‌వి చాలా పెద్ద సౌర తుఫాన్లు అని తెలిపారు. ఒక వేల ఈ సౌర తుఫాన్లు భూమిని తాకితే.. రేడియో క‌మ్యూనికేష‌న్లును తీవ్రం గా ప్ర‌భావితం చేస్తాయ‌ని అన్నారు. అలాగే జీపీఎస్ ఆధారంగా న‌డిచే వ్య‌వ‌స్థ‌లు అన్నీ కూడా కుప్ప కూలిపోతాయ‌ని హెచ్చ‌రించారు. అలాగే ఇంటర్నెట్ సౌక‌ర్యానికి అడ్డంకులు ఏర్పాడుతాయ‌ని అన్నారు. అలాగే ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌వ‌ర్ గ్రిడ్ల లో విద్యుత్ హెచ్చుత‌గ్గులు కూడా ఏర్పాడుతాయ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version