స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. ముంబై ఇండియన్స్ తో బ్రేబౌర్న్ స్టేడియం వేదిగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్స్ భారీ స్కోర్ సాధించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్నీ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లకు చుక్కులు చూపించాడు. కేవలం 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 106 రన్స్ చేశాడు.
అయితే.. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కు ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా… కేఎల్ రాహుల్ పై రూ.12 లక్షల జరిమానా పడింది. నిర్ణీత సమయానికి… ఓవర్లు వేయకపోవడంతో… ఈ ఫైన్ వేసింది బీసీసీఐ. కాగా..ఈ మ్యాచ్ లో లక్నో ఇచ్చిన 200 భారీ లక్ష్యాన్ని చేధించడంలో ముంబై బ్యాట్స్ మెన్లు తడబడ్డారు.
ఓపెనర్లు.. రోహిత్ (6), ఇషాన్ కిషన్ (13) తో మరోసారి విఫలం అయ్యారు. జూనియర్ ఏబీగా పేరు ఉన్ డెవాల్డ్ బ్రెవిస్ (13 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 6 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి పరుగుల వరద పారించాడు. అలాగే సూర్య కుమార్ (37), తిలక్ వర్మ (26), పోలార్డ్ (25) స్వల్ప పరుగులు మాత్రమే సాధించారు. దీంతో ముంబై భారీ టార్గెట్ ముందు తెలిపోయింది.