కష్టాల్లో ఆర్సీబీ.. కీలక వికెట్లు పడగొట్టిన ముస్తఫిజర్

-

ఐపీఎల్ 2024 సీజన్ ఎప్పుడు ఎప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్రికెట్ అభిమానులకు శుభవార్తగా ఇవాళ ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ప్రారంభ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి బిగ్ షాక్ తగిలింది. CSK బౌలర్ ముస్తాఫిజర్ విజృంభించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 12 ఓవర్లకే 5 కీలక వికెట్లను కోల్పోయింది. డుప్లెసిస్ (35), విరాట్ కోహ్లీ(21), గ్రీన్ (18), రజత్ పాటీదార్, మ్యాక్స్ వెల్ డకౌట్ అయ్యారు. 41 పరుగుల వద్ద తొలుత డూప్లెసిస్ ఔట్ కాగా.. అదే 41 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఇక వెంటనే వచ్చిన మ్యాక్స్ వెల్ కూడా 42 పరుగుల వద్ద డకౌట్ అయ్యాడు. 12వ ఓవర్ లో విరాట్ కోహ్లీ, గ్రీన్ ఔట్ అయ్యాడు. కీలక వికెట్లను ముస్తఫిజర్ తీసి ఆర్సీబీని కోలుకోలేని దెబ్బ తీశాడు. మ్యాక్స్ వెల్ మాత్రం దీపక్ చాహర్ ఔట్ చేశాడు. మిగిలిన నలుగురిని ముస్తఫిజర్ ఔట్ చేయడం విశేషం. ప్రస్తుతం 16.2 ఓవర్లకు ఆర్సీబీ 120 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version