ఐపీఎల్ ఫ్యాన్స్ కు నిరాశ‌.. ఆరంభ వేడుక‌లు లేకుండానే సీజ‌న్ ప్రారంభం

-

ఐపీఎల్ అభిమానుల‌కు మ‌రో సారి నిరాశ ఎదురైంది. ఈ సీజ‌న్ ను కూడా ఆరంభ వేడుక‌లు లేకుండానే ప్రారంభించాల‌ని బీసీసీఐ భావిస్తుంది. కాగ క్రికెట్ లో ఐపీఎల్ కు ఆద‌ర‌ణ ఎక్కువగా ఉంది. దీంతో దీని క్యాచ్ చేసుకోవ‌డానికి బీసీసీఐ ఐపీఎల్ ను ప్ర‌తి ఏటా ఘ‌నంగా నిర్వ‌హిస్తుంది. అలాగే ఐపీఎల్ ప్రారంభం అయిన నాటి నుంచి ప్ర‌తి సీజ‌న్ లో ముందు అంగ రంగ వైభవంగా ప్రారంభ వేడుక‌ల‌ను నిర్వ‌హించే వారు. కానీ 2018 ఐపీఎల్ త‌ర్వాత వ‌రుస‌గా మూడు ఏళ్ల పాటు ఆరంభ వేడుక‌ల‌ను బీసీసీఐ నిర్వ‌హించ‌డం లేదు.

కాగ ఈ ఏడాది కూడా ఐపీఎల్ ను ఆరంభ వేడుక‌లు లేకుండానే నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తుంది. ఐపీఎల్ మ్యాచ్ లు జ‌రుగుతున్న మ‌హారాష్ట్రలో ఉన్న క‌రోనా నిబంధ‌నల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఐపీఎల్ నిర్వ‌హించ‌డానికి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం మొద‌ట అన్ని ర‌కాల అనుమ‌తి ఇవ్వ‌డానికి సిద్ధం అయింది. కానీ ఇటీవ‌ల చైనా తో పాటు మ‌రి కొన్ని దేశాల్లో క‌రోనా వైరస్ వ్యాప్తి విస్త‌రిస్తుంది.

సౌత్ కొరియా దేశంలో ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి రోజు ల‌క్షల సంఖ్య కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. కేంద్ర ప్ర‌భుత్వం కూడా మ‌రో సారి క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది కూడా ఆరంభ వేడుక‌లు లేకుండానే ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. కాగ మ‌రో నాలుగు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version