U19 వరల్డ్ కప్ లో కుర్రాళ్ల గెలుపుపై ప్రధాని మోదీ హర్షం

-

అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ గెలుపుపై సర్వత్ర శుభాకాంక్షలు వ్యక్తం అవుతున్నాయి. ఐదో సారి అండర్ 19 వరల్డ్ కప్ ను కుర్రాళ్లు సాధించారు. ఫైనల్లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. వీరి గెలుపు పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ కూడా కుర్రాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. ఒక్కొక్క ఆటగాడికి రూ. 40 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది.

అండర్ 19 వరల్డ్ కప్ కుర్రాళ్ల గెలుపు పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. “వారు టోర్నమెంట్ ద్వారా గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. అత్యున్నత స్థాయిలో వారి అద్భుతమైన ప్రదర్శన భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితంగా, సమర్థుల చేతుల్లో ఉందని నిరూపించారు” అని మోదీ అన్నారు. మన యువ క్రికెటర్లను చూసి చాలా గర్వపడుతున్నాను. ICC U19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు అభినందనలు. ఈ టోర్నీ ద్వారా వారు గొప్ప సత్తా చాటారు. అని ప్రధాని మోదీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version