ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2019 – 21 ఫైనల్ లో కివీస్ విజయం సాధించి టైటిల్ గా గదను దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో ఇండియాకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. కాగా ఇప్పుడు మరో సీజన్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. అయితే ఈ సారి ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన ఫైనల్ జరుగుతుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో టైటిల్ ను దక్కించుకోవడంలో విఫలం కాగా.. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ మ్యాచ్ లో అయినా గెలిచి టైటిల్ గా ఉన్న గదను దక్కించుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇండియాకు కీలక ఆటగాళ్లు అయిన రాహుల్, బుమ్రా , పంత్ లాంటి వాళ్ళు దూరం కావడం చాలా దెబ్బ అని చెప్పాలి.