ఆర్సిబి పేసర్ యాష్ దయాల్ పై తాజాగా పోక్సో కేసు నమోదు అయింది. తనపై రెండేళ్లుగా అత్యాచారం చేశాడంటూ దయాల్ పై జైపూర్ లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. క్రికెట్ కెరీర్ విషయంలో సహాయం చేస్తానని తనకు హామీ ఇచ్చాడని మొదటిసారి తనను సీతాపురంలోని ఒక హోటల్ కు పిలిచాడంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అక్కడే మొదటిసారిగా తనపై లైంగిక దాడి జరిగిందని వెల్లడించింది. అప్పుడు తనకు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే అని చెప్పింది.

దీంతో దయాల్ పై పోక్సో కేసు నమోదు అయింది. ఇప్పటికే గజియాబాద్ జిల్లాలో యష్ దయాల్ పై రేప్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి యశ్ దయాల్ పై కేసు నమోదు అవ్వడంతో తన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దయాల్ ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా… దయాల్ క్రికెట్ కెరీర్ పై ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందేమోనని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసు రుజువు అయితే RCB బౌలర్ దయాల్ కు 10 ఏళ్ళ జైలు శిక్ష ? పడే ప్రమాదం ఉందట.