కోస్తాంధ్రలో ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి సూచనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే హోం మంత్రి అనిత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాలు, ప్లాష్ ఫ్లడ్స్ ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను హోంమంత్రి అనిత ఆదేశించారు.

కోస్తాంధ్ర తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని ఆదేశించారు. అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్(112, 1070, 18004250101) ను సంప్రదించాలని అనిత కోరారు.
ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. బంగాళాఖాతంలో మరింత అల్పపీడనం బలపడటంతో.. ఈ నెల 27 వరకు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.