ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ RCB వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీ ఆరంభంలోనే కాస్త తడబడింది. కేవలం 8 పరుగుల వద్దనే ఓపెనరల్ విరాట్ కోహ్లీ 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తరువాత పడిక్కల్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
మరోవైపు ఆర్బీసీ బ్యాటర్ సాల్ట్ ఈ సీజన్ లోనే అతి భారీ సిక్స్ ను బాదాడు. సిరాజ్ వేసిన ఓవర్ లో ఆయన కొట్టిన షాట్ కి బంతి 105 మీటర్ల దూరం వెల్లింది. కానీ ఆ తరువాత బంతికే సాల్ట్ ను సిరాజ్ బౌల్డ్ చేయడం విశేషం. మరోవైపు కెప్టెన్ రజత్ పటిదార్ ను ఇషాంత్ శర్మ LBW చేశాడు. 11 ఓవర్లకు ఆర్సీబీ 80 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆర్సీబీ కష్టాల్లో పడిందనే చెప్పాలి. లివింగ్ స్టోన్, జితేష్ శర్మ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.