షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ జ‌ట్టుపై నిషేధం..!

-

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. జింబాబ్వే జ‌ట్టును అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ప్ర‌పంచ క్రికెట్‌లో ఒక‌ప్పుడు అగ్ర‌శ్రేణి జ‌ట్ల‌ను మ‌ట్టి కరిపించిన జ‌ట్ట‌ది.. ఆ దేశ క్రికెట్ జ‌ట్టుకు చెందిన కొంద‌రు మాజీ ప్లేయ‌ర్లు ప‌లు అగ్ర‌శ్రేణి జ‌ట్ల‌కు కోచ్‌లుగా కూడా వ్య‌వ‌హ‌రించారు. అలాంటిది ఆ దేశ క్రికెట్ జ‌ట్టు భ‌విత‌వ్యం ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇక‌పై ఆ జ‌ట్టు ఇక క్రికెట్ ఆడే అవ‌కాశం లేదు. ఐసీసీ ఆ జ‌ట్టును స‌స్పెండ్ చేసింది. ఇంత‌కీ ఆ జ‌ట్టు ఏదంటే.. జింబాబ్వే.. అవును.. అదే.. ఆ జ‌ట్టునే ఇక‌పై క్రికెట్ ఆడ‌కుండా ఐసీసీ నిషేధం విధించింది.

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. జింబాబ్వే జ‌ట్టును అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఐసీసీ జింబాబ్వే క్రికెట్ జ‌ట్టును స‌స్పెండ్ చేసింది. దీంతో ఆ జ‌ట్టు ఇక ఐసీసీ నిర్వ‌హించే ఏ అంత‌ర్జాతీయ టోర్నీలోనూ ఆడేందుకు అవ‌కాశం లేదు. అలాగే జింబాబ్వే క్రికెట్‌కు అందిస్తున్న సహాయాన్ని కూడా ఐసీసీ నిలిపివేసింది. ఆ జ‌ట్టుపై స‌స్పెన్ష‌న్ త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌చ్చింద‌ని ఐసీసీ తెలిపింది.

జింబాబ్వే క్రికెట్ బోర్డు వ్య‌వ‌హారాల్లో ఆ దేశ ప్ర‌భుత్వ జోక్యం అధిక‌మైంద‌ని.. అందుక‌నే ఈ నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సిన వ‌చ్చింద‌ని ఐసీసీ తెలిపింది. కాగా ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో జింబాబ్వే క్రికెట్ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇక‌పై ఆ జ‌ట్టుతో ఏ ఇత‌ర దేశ జ‌ట్టు క్రికెట్ ఆడ‌కూడ‌దు. అయితే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 5వ తేదీ నుంచి భార‌త్‌లో జింబాబ్వే టూర్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం వ‌ల్ల ఆ సిరీస్ ర‌ద్ద‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి ఐసీసీ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటుందా.. లేదా.. చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version