Fact Check: పీఎం స్కూటీ యోజ‌న‌.. నిజంగా ఈ ప‌థ‌కాన్ని మోదీ ప్రారంభించారా..?

-

బాలిక‌ల‌కు ఉచితంగా స్కూటీల‌ను అందించే పీఎం స్కూటీ యోజ‌న ప‌థ‌కాన్ని కేంద్రం ప్రారంభించింద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇందులో ఎంత‌మాత్రం నిజం లేదు.

మ‌హిళా సంక్షేమం కోసం కేంద్ర ప్ర‌భుత్వం 10వ త‌ర‌గ‌తి పాసైన బాలిక‌ల‌కు ఉచితంగా స్కూటీల‌ను అందిస్తోంది.. అంటూ.. గ‌త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం విదిత‌మే. 10వ త‌ర‌గ‌తి పాసైన బాలిక‌లు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే పీఎం స్కూటీ యోజ‌న కింద ఉచితంగా స్కూటీని పొంద‌వ‌చ్చ‌ని గ‌త కొద్ది రోజులుగా తీవ్ర‌మైన ప్రచారం సాగుతోంది. అయితే ఇంత‌కీ ఈ ప‌థ‌కాన్ని నిజంగా ప్ర‌ధాని మోదీ ప్రారంభించారా..? ఇందులో వాస్త‌వమెంత‌.. అన్న‌వివ‌రాల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే..

బాలిక‌ల‌కు ఉచితంగా స్కూటీల‌ను అందించే పీఎం స్కూటీ యోజ‌న ప‌థ‌కాన్ని కేంద్రం ప్రారంభించింద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇందులో ఎంత‌మాత్రం నిజం లేదు. అస‌లు నిజంగా కేంద్రం ఇలాంటి ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నేలేదు. మ‌రి సోష‌ల్ మీడియాలో మోదీ బాలిక‌ల‌కు స్కూటీల‌ను అందిస్తున్న ఫొటోలు ఉన్నాయి క‌దా.. అంటే.. అవును.. ఉన్నాయి. అయితే అవి స్కూటీ ప‌థ‌కానివే.. కానీ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం కాదు. గ‌తంలో మోదీ ఒక‌సారి త‌మిళ‌నాడు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ అమ్మ స్కూట‌ర్ స్కీం కింద ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం బాలిక‌ల‌కు 50 శాతం స‌బ్సిడీతో స్కూటీల‌ను అందిస్తున్న ప‌థ‌కాన్ని ఆయ‌న ప్రారంభించారు. అది త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వ పథ‌కం.. దాన్ని ప్రారంభించేందుకు మోదీ అక్క‌డికి వెళ్లారు. అంతే.. కానీ దాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే ప్రారంభించింద‌ని చెబుతూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో ఆ ఫొటోల‌కు త‌ప్పుడు క‌థ‌నాల‌ను సృష్టించి ప్ర‌చారం చేశారు.

ఇక దీనిపై పలువురు కేంద్ర మంత్రులు కూడా స్పందించారు. అస‌లు ఈ ప‌థ‌కాన్ని మోదీ ప్రారంభించనేలేద‌ని, అవ‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని తేల్చి చెప్పారు. ఎవ‌రూ ఇలాంటి న‌కిలీ వార్త‌ల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్దని కూడా వారు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక జాగ్ర‌త్త‌.. ఇలాంటి ప‌థ‌కాల పేర్లు చెప్పి ల‌బ్ది చేకూరుస్తామంటూ.. కొంద‌రు మీ వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని మోసం కూడా చేస్తుంటారు. క‌నుక‌.. ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మే ముందు ఒక్క‌సారి ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే మ‌న‌కే మంచిది. లేదంటే మ‌న‌మే న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version