భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు అద్భుత పోరాటం చేసింది. 462 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో పోరాటం ముగిసినట్టయింది. సర్ఫరాజ్ 150, పంత్ 99 పరుగులు చేశారు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు రిషబ్ పంత్. ప్రస్తుతం భారత్ 106 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో న్యూజిలాండ్ జట్టు 107 పరుగులు సాధిస్తే.. విజయం వరిస్తుంది.
ముఖ్యంగా రిషబ్ పంత్ కి 90 పరుగులు దాటిన తరువాత దురదృష్టం వెంటాడుతోంది. 2018 నుంచి ఇప్పటివరకు 7 సార్లు 90ల్లో ఔట్ అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, విలియం 3 చొప్పున వికెట్లు తీయగా.. అజీజ్ పటేల్ 2 వికెట్లు తీశాడు. సౌథి, ఫిలిప్స్ చెరో వికెట్ తీశారు. మరీ న్యూజిలాండ్ ని భారత జట్టు 107 పరుగులు చేయకుండా కట్టడి చేస్తుందా..? లేక పరుగులు సమర్పించుకుంటుందో చూడాలి మరీ.