‘కేసీఆర్’ ట్రైలర్ వచ్చేసింది

-

ఈటీవీలో వచ్చిన జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి వచ్చిన చాలా మంది ప్రముఖ కమెడియన్స్ హీరోలుగా మారారు. వారిలో యువ నటుడు రాకింగ్ రాకేష్ కూడా ఒకడు. తన టాలెంట్ తో బుల్లితెర పై సత్తా చాటిన ఈ కమెడియన్ సిల్వర్ స్క్రీన్ పై కూడా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు తానే లీడ్ రోల్ లో చేసిన తాజా చిత్రం కేసీఆర్. దీని ఫుల్ నేమ్ “కేశవ చంద్ర రమావత్” ఈ చిత్రం కేసీఆర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

ఈ ట్రైలర్ డీసెంట్ ఎమోషన్స్ తో ఆకట్టుకునేవిధంగా ఉంది. చిన్న పిల్లల డైలాగ్ లతో  మొదలైన ట్రైలర్.. పల్లెటూరు నేపథ్యంలో సాగే కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. అవును బావ నీకు మొన్న నెమలీక ఇచ్చిన అది పిల్లల పెట్టిందా..? అని హీరోయిన్ ప్రశ్నిస్తే.. పెట్టలేదే.. ఈరోజు చూసిన మళ్లీ చూసి చెబుతాననే డైలాగ్ ఆకట్టుకుంటుంది. దొంగ కోళ్లు పట్టేది.. చికెన్ ముక్కల సీన్స్ కాస్త ఫన్నీగా ఉన్నాయి.  ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, రచన సహా నిర్మాణం రాకింగ్ రాకేష్ అందించగా.. గరుడ వేగ అంజి దర్శకత్వం, సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని విభూది ఎంటర్టైన్ మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version