భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసిస్ జట్లపై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, కంగారులకు అడ్డుకట్ట వేయడంలో పై చేయి సాధించింది. తొలి ఓవర్ నుంచి ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేస్తూ టీమిండియా బౌలర్లు తమదైన శైలిలో బౌలింగ్ ప్రదర్శన చేశారు.
ఫలితంగా ఆసీస్ బ్యాటర్లు 188 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో క్రిజులోకి వచ్చిన టీమిండియా ఓపెనర్లు కూడా జట్టుకు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ జట్టును విజయతీరాలకు చేర్చాడు కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్ లో అజేయంగా 75 పరుగులతో తన సత్తా చాటాడు. అలాగే టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా 45 పరుగులతో రాణించడంతో తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది.