భారత్ కి ఎదురు దెబ్బ.. ముగ్గురు బ్యాటర్లు డకౌట్..!

-

ప్రపంచ కప్ లో భారత బ్యాటర్లకు ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇవాళ ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య  మ్యాచ్ జరిగింది.  రెండు జట్లకు కూడా ఇది   తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ఇక  ఈ మ్యాచ్లో తొలత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 199 పరుగులు చేసింది. ఆ తర్వాత చేధనకు దిగిన టీమిండియా కి వరుసగా బిగ్ షాక్  ఇచ్చారు ఆస్ట్రేలియా బౌలర్లు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ముగ్గురు కూడా ఖాతా తెరవక ముందే 0 పరుగులకే  అవుట్ అయ్యారు.

దీంతో రెండు ఓవర్లు ముగిసే సరికి కేవలం భారత్ రెండు పరుగులు మాత్రమే చేసి మూడు టాప్ ఆర్డర్ కీలక వికెట్లను కోల్పోయింది. ఆ రెండు పరుగులు కూడా ఎక్స్ ట్రా రూపంలో వచ్చినవే. దీని ఫలితంగా ప్రత్యర్థి జట్టును 1999 అర్హులకు ఆల్ అవుట్ చేశామనే ఆనందం కాసేపు కూడా లేకుండా పోయింది. మిచల్ స్టార్ కు బౌలింగ్ లో ఇషాన్ కిషన్ స్లిప్ లో కామరూన్ గ్రీన్ కి క్యాచ్ ఇచ్చి అవుట కాదా.. ఆరు బంతులాడిన రోహిత్ శర్మ జోష్ హజల్ వుడ్ బౌలింగ్ లో డక్ అయ్యాడు. రోహిత్ రివ్యూ తీసుకున్నప్పటికీ అంపైర్ కాల్స్ గా రావడం వల్ల టీమిండియా ఫలితం దక్కలేదు.

సూర్యకుమార్ యాదవ్ ని కాదని జట్టులో స్థానం సంపాదించిన శ్రేయస్ అయ్యర్ కూడా 3 బంతులు ఆడి హెజిల్ వుడ్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో ఈ ప్లేయర్లపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. చివరగా 2019 వరల్డ్ కప్ లో కూడా సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ పై 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. ఈసారి ఏకంగా 2 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. వరల్డ్ కప్ మ్యాచ్ లో 40 ఏళ్ల తరువాత తొలిసారి ఇదే కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version