కీలకం అయిన మ్యాచ్ లో బెంగుళూరు బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఈ సీజన లోనే పేలవలమైన ప్రదర్శన చేసి ఐపీఎల్ ప్లే ఆఫ్ కు దూరమైన రెండవ జట్టుగా ఉన్న సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టు ను కూడా తమ బౌలింగ్ తో నిలువరించలేక భారీగా పరుగులు సమర్పించుకుంది. టాస్ గెలిచిన బెంగుళూరు ఛేజింగ్ ఎంచుకోగా, SRH ఆటగాళ్లు ధనాధన్ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. SRH లో ఓపెనర్లు అభిషేక్ శర్మ , రాహుల్ త్రిపాఠి లు అవుట్ అయినా, కెప్టెన్ మార్ క్రామ్ అండ లేకపోయినా సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన హేన్రిచ్ క్లాజెన్ అద్భుతమైన షాట్ లతో విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ద సెంచరీ సాధించిన క్లాజెన్.. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయి ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్ లోనే మొదటి సెంచరీ 104 సాధించి జట్టు పరువును కాపాడాడు.
ఐపిఎల్ 2023 : బెంగళూర్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్… టెన్షన్ లో కోహ్లీ ఫ్యాన్స్ !
-