చెన్నై మరియు బెంగుళూరు ఐపీఎల్ జట్ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ ముందుగా ఊహించిన విధంగానే మంచి వినోదాన్ని అందిస్తోంది అని చెప్పాలి. మొదట టాస్ గెలిచిన బెంగుళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, చెన్నై బ్యాటింగ్ లో అదరగొట్టింది. మొదట్లో నెమ్మదిగానే ఆడిన ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి బెంగుళూరు బౌలర్లకు చుక్కలు చూపించారు. చెన్నిఆ నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. చెన్నై భారీ స్కోర్ చేసిందంటే అందుకు కారణం కాన్ వే (83), దుబే (53) మరియు రహానే (37) లు అని చెప్పాలి. వీరు జట్టు స్కోరును పెంచడం మీదనే తమ దృష్టిని పెట్టారు.
ఐపీఎల్ 2023 : బెంగుళూరు ముందు కొండంత లక్ష్యం…
-