సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో CSK ఓటమితో ఏడ్చేసారు శ్రుతి హాసన్ ఏడ్చారు. చెన్నైపై 12 ఏళ్ళ తర్వాత SRH ఘన విజయం సాధించింది. IPL 2025లో భాగంగా శుక్రవారం చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై పై 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 154 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

ఇక చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలవ్వడంతో నటి శ్రుతి హాసన్ భావోద్వేగానికి లోనయ్యారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ఆమె స్నేహితులతో కలిసి హాజరై మ్యాచ్‌ను తిలకించారు. ధోనీ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు మురిసిపోయిన శ్రుతి, చివర్లో CSK ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్షణాలు కెమెరా లో చిక్కి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.